ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పొట్ట రావడానికి కారణాలేంటి? తగ్గాలంటే ఏమి చేయాలి??

పొట్ట చుట్టూ కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్ అనేది మహిళలు, పురుషులు అని లేకుండా అందరు ఎదుర్కొంటున్న సమస్య! ప్రస్తుత కంప్యూటర్ యుగంలో శరీరక శ్రమ తగ్గిపోవడంతో పాటు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకోవడం, ఆహార అలవాట్లలో తేడా రావడం మరియు మారిన జీవన శైలి, అల్కాహాల్, స్మోకింగ్ తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. శరీర ఆకృతి కూడా చూసేందుకు అసహ్యంగా మారుతుంది.

ఇక అప్పటినుండి బాన పొట్ట కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతూ వ్యాయామం చేయడం, డైట్ ఫాలో కావడం, స్వీట్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం చేస్తుంటారు. అయినప్పటికీ పొట్ట చుట్టూ కొవ్వు కరగక ఇబ్బందులు పడుతుంటారు.

అయితే నిపుణుల ప్రకారం పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణంగా విటమిన్ సీ లోపమని చెబుతున్నారు. ఎక్కువ మంది విటమిన్ సీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్తారు కానీ అది నిజం కాదు. వాస్తవానికి మన మెదడు చురుగ్గా పని చేయాలన్నా, గర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండాలన్నా, ఎముకలు పటుత్వంగా ఉండాలన్న విటమిన్ సీ ఎంతో అవసరం!

నిజానికి శరీర బరువును క్రమబద్దీకరించడంలో కూడా విటమిన్ సీ బాగా పని చేస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, కొవ్వు పేరుకుపోకుండా ఉండాలన్నా కశ్చితంగా విటమిన్ సీ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ సీ నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి, టమాటా, బొప్పాయి, క్యాప్సికమ్, బ్రకోలీ, మొలకలు, కాలిఫ్లవర్ వంటి వాటిలో సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే కొవ్వును నియంత్రించుకోవచ్చు, పొట్టను తగ్గించుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •