వార్తలు (News)

పతనమైన టమోటా ధర.. ఎంతంటే కిలో రూ.2!!

ప్యాపిలి మార్కెట్‌లో టమోట ధరలు భారీగా పడిపోయి కిలో టమోటా గురువారం కేవలం రూ.2 పలికింది. 25 కిలోల గంప ధర రూ.50 మించడం లేదు. గత 15 రోజులుగా ధరలు ఇలాగే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం నుంచి మార్కెట్‌కు దిగుబడులు తరలించాలంటే గంపకు రూ.20 ఆటోకు చెల్లించాల్సి వస్తోందని, ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని పెద్దపూదిళ్ల, చిన్నపూదిళ్ల, గుడిపాడు, వెంగళాంపల్లి, ఏనుగమర్రి రైతులు వాపోతున్నారు.

మార్కెట్‌లో వ్యాపారుల కమీషన్లు, కూలీల ఖర్చు, రవాణా చార్జీలు పోగా చేతికి చిల్లిగవ్వ కూడా రావడం లేదని కంటతడి పెడుతూ ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత దిగజారిపోయి ప్రమాదం ఉందని వాపోతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •