జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

కెప్టెన్సీకి గుడ్ బై: విరాట్ కోహ్లీ??

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకుని అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి అందరిని దిగ్భ్రాంతికి గురిచేశాడు. ‘ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాకు అత్యంత సన్నిహితులు, రవి భాయ్, రోహిత్ శర్మతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చా. దీని గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాతో పాటు సెలక్టర్లతో కూడా మాట్లాడా’ అని ట్విట్టర్ వేదికగా సూచించాడు.

ఇండియన్ క్రికెట్, టీమ్‌కు తన శాయశక్తులా అండగా ఉంటానని,ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉండటంలో తనకు సపోర్ట్ చేసిన టీమ్ సభ్యులు, సిబ్బందికి కోహ్లీ ధన్యవాదాలు చెప్పాడు. టీమ్ సభ్యులు, కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు ప్రతి భారతీయుడు తన విజయానికి సపోర్ట్ చేశారన్నాడు. వర్క్ లోడ్ కారణంగానే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని కోహ్లీ చెప్పడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •