అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

ఆరుగురు ఉగ్రవాదులు.. భీకర దాడులకు ప్రయత్నాలు..!!

దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రముఠాను దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాబోయే పండగల సీజన్‌లో దాడులకు పాల్పడేందుకు వీరు కుట్రలు చేసి 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహా దాడులకు వీరు ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. దీనికోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వర్గాలు గురువారం వెల్లడించాయి.

నిఘా సంస్థలు ఇచ్చిన పక్కా సమాచారంతో గత మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో అనూహ్య దాడులు నిర్వహించిన దిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురిని, దిల్లీలో ఇద్దరిని, రాజస్థాన్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారిని దర్యాప్తు చేయగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం.

ఈ ఉగ్రవాదులకు రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జ్‌లు పేల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తెలిసిందని దిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల తరహాలో దాడులకు ప్లాన్‌ చేసినట్లు, ఇందుకోసం కొన్ని ప్రాంతాలను ఎంచుకున్న ముష్కరులు అక్కడ రెక్కీ నిర్వహించేందుకు వెళ్లారు. రెక్కీ అనంతరం వీరంతా ఒక చోట చేరి ఆపరేషన్‌ చేపట్టాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద సమూహాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

అరెస్టయిన వారిలో ఇద్దరు ముష్కరులు సముద్రమార్గం ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చారని తెలిసింది. విచారణలో కొందరు స్లీపర్ సెల్స్‌ పేర్లను ముష్కరులు చెప్పినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వారి కోసం గాలిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలిపాయి. అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి 1.5కిలోల ఆర్డీఎక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •