క్రైమ్ (Crime) వార్తలు (News)

రైలు పట్టాలపై దొరికిన అత్యాచార బాధితుడి మృతదేహం!!

సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు పల్లంకొండ రాజు మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించినట్లు జనగామ పోలీసులు తెలిపారు. చేతిపై మౌనిక అని ఉన్న పచ్చబొట్టు, ఇతర గుర్తుల ఆధారంగా మృతదేహం ఆయనదేనని తేల్చారు. రాజు కుటుంబ సభ్యులకు కూడా దీనిపై సమాచారం ఇచ్చామని, పల్లంకొండ రాజుది ఆత్మహత్యేనని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.

రైల్వే సిబ్బంది ఉదయం ట్రాక్‌ను పరిశీలిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పట్టాలపై నడుస్తుండడంతో ఆయన్ను పట్టాలపై వెళ్లిపోమని వారు సూచించారని, దాంతో ఆయన పరుగులు తీశాడని, అదే సమయంలో హైదరాబాద్ వైపు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని మరణించాడని, పోలీసులకు సమాచారం అందిన వెంటనే వెళ్లి చూడగా అది పల్లంకొండ రాజు మృతదేహమని గుర్తించినట్టు అన్నారు.

మేం వచ్చే సమయంలో.. ఓ వ్యక్తి చెట్లలోకి పోయాడు. మమ్మల్ని చూసి పారిపోయినట్లు అనిపించింది. వెంటనే మేం చెట్లలోకి చూశాం. కానీ ఎవరూ కనిపించలేదు. ఎవరో అనుకుని మా పని మేం చేసుకుంటూ పోయాం”అని, మేం దాదాపు 200 మీటర్ల వరకు వెళ్లిపోయాం. అయితే, అక్కడ ఎవరో రైలు కింద పడ్డారని మాకు చెప్పారు. దీంతో మేం వెనక్కి వచ్చిచూశాం. హైదరాబాద్ వెళ్తున్న కోణార్క్ రైలు కింద పడటంతో 8.45 నిమిషాలకు అటూఇటూగా అతడు మరణించారు” అని ప్రత్యక్ష సాక్షులు రైల్వే సిబ్బంది అయిన టీ కుమార్, సారంగపాణి వివరించారు.

అయితే రాజుది ఆత్మహత్య కాదు, పోలీసులే చంపేశారని రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అడ్డగూడూరు నుంచి మమ్మల్ని శుక్రవారం తీసుకెళ్లారు. ఆరు రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. రైల్వే స్టేషన్‌లో దొరికాడని ఆదివారమే అన్నారు. ఎన్‌కౌంటర్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు ఆదివారం మాట్లాడుకుంటుంటే విన్నాము. నిన్న వచ్చి హడావుడిగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. రాత్రి పది గంటలకు మమ్మల్ని ఉప్పల్‌లో వదిలేశారు” అని నిందితుడి తల్లి చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •