దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,59,932 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,447 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్ల కు చేరింది. నిన్న ఒక్కరోజే 391 మరణాలు నమోదవ్వడంతో ఇప్పటివరకు మరణించినవారి మొత్తం సంఖ్య 4.76 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 7,886 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.41 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 86,415గా ఉంది.