గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువమంది ఉపయోగిస్తారనే సంగతి అందరికి తెలిసిందే! ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గూగుల్ క్రోమ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. క్రోమ్‌లో చోటుచేసుకున్న ఒక బగ్ వినియోగదారుల గోప్యతను, అలాగే పరికరంలోకి మాల్వేర్ చొరబడే ప్రమాదానికి దారి తీస్తోందని స్పష్టం చేశారు.

ఐతే ప్రస్తుతం గూగుల్ ఈ లోపాన్ని సరిదిద్ది దాని కోసం ఒక అప్ డేట్ ను జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు గూగుల్ కూడా కొత్త అప్డేటెడ్ క్రోమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని వినియోగదారులను ఆదేశించింది. ఈ సరి కొత్త అప్డేట్ 22 భద్రతా పరిష్కారాలను అందిస్తుంది. ఈ లోపాలను రీసెర్చర్లు గూగుల్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో వీలైనంత త్వరగా తమ బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని గూగుల్ తమ వినియోగదారులను కోరింది.