దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఫెడ్‌ నిర్ణయాలు, ఒమిక్రాన్‌ భయాలతో సూచీలు ఆచి తూచి కదలాడాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,021.63 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా అదే బాటలో పయనించి ఇంట్రాడేలో 56,950.98 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 889.40 పాయింట్ల నష్టంతో 57,011.74 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,276.00 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 16,966.45 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 263.20 పాయింట్లు నష్టపోయి 16,985.20 వద్ద ముగిసింది.