నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు తీవ్ర చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్‌ వరకు స్పీడ్‌ గన్‌ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేయడం ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయని రెండోసారి పట్టుబడితే మాత్రం వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు.