ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్, లాస్కర్ లాంటి రకరకాల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://joinindiancoastguard.gov.in లో తమ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ డిసెంబర్ 11న జారీ చేశారు. ఆఫ్‌లైన్ ఫారమ్‌లను సమర్పించడానికి గడువు తేదీ జనవరి 30గా నిర్ధారించారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేస్తారు.

పోస్టుల వివరాలు:
సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 11 పోస్టులు
ఇంజిన్ డ్రైవర్: 5 పోస్టులు
మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్: 5 పోస్టులు
లాస్కర్: 5 పోస్టులు
సారంగ్ లాస్కర్: 2 పోస్టులు
ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 5 పోస్టులు
ఫైర్‌మెన్: 53 పోస్టులు
స్టోర్ కీపర్ గ్రేడ్ 2: 3 పోస్టులు
స్ప్రే పెయింటర్ – 1 పోస్ట్
మోటార్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్: 1 పోస్ట్
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): 3 పోస్ట్‌లు
అన్‌స్కిల్డ్ లేబర్: 2 పోస్ట్‌లు

జీతం, అర్హతల వివరాలు :
ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లాస్కర్: PB 1, 5200-20200 + రూ. 2400 (GP)
ఫైర్ ఇంజన్ డ్రైవర్: PB – 1, 5200-20200 + రూ. 2000 (GP)
ఫైర్‌మ్యాన్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్, స్టోర్ కీపర్ గ్రేడ్ 2, స్ప్రే పెయింటర్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ మెకానిక్, లాస్కర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్), అన్‌స్కిల్డ్ లేబర్ – PB – 1, 5200-20200 + రూ. 1900 (GP) అన్ని పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్‌ సర్టిఫికెట్‌, అనుభవం ఉండాలి.