దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 244 పాయింట్ల నష్టంతో 57,656 వద్ద ట్రేడవుతుండగా .. నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 17,168 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో కలవరపడుతున్న మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ప్రయాణిస్తున్నాయి. మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.