బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్(31) గంటల కొద్దీ లైన్లలో నిలబడి రోజుకు సగటున రూ. 16 వేలు మన కరెన్సీలో సంపాదిస్తున్నారు. క్యూలో నిలబడి ఏం చేస్తాడో తెలుసా? ఏమి చేయడు. తన వంతు వచ్చాక.. కౌంటర్‌లో ఏది ఇస్తే అది కొంటాడు. ఆ తరువాత ఎవరి కోసమైతే ఇలా లైన్లో నిలబడ్డాడో వారికి తాను కొన్న వస్తువు ఇచ్చేస్తాడు.

ఇదంతా చేసినందుకు వారి నుంచి కొంత మొత్తాన్ని పుచ్చుకుంటాడు. క్యూలో గంటల తరబడి నిలబడలేని ధనికులు ఫ్రెడ్డీ సేవలు వినియోగించుకుంటారట. ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు, సినిమా టిక్కెట్ల కోసం వృధ్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు తనను సంప్రదిస్తుంటారని ఫ్రెడ్డీ తెలిపాడు. ఇలా క్యూలో నిలబడి సంపాదించడంతో పాటూ ఫ్రెడ్డీ కాల్పనిక నవలలు కూడా రాస్తుంటాడట.