దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 16.49లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తే 2,38,018 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మరణించినవారి మొత్తం సంఖ్య 4,86761 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 1,57,421 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,36,628 మంది కరోనాతో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 4.62శాతంగా ఉంది.