లంచం ఆరోపణల కేసులో నాచురల్ గ్యాస్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ గెయిల్ డైరెక్టర్ ఇ.ఎస్.రంగనాథన్‌ అరెస్ట్ అయ్యారు. మహారత్న ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ నుంచి పెట్రో కెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు డిస్కౌంట్ ఇచ్చేందుకు రూ.50 లక్షలకు పైగా లంచం తీసుకున్నారనే ఆరోపణల కేసులో ఆయన్ని సిబిఐ అరెస్టు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో రంగనాథన్, వ్యాపారవేత్తలు ఉన్నారని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని సిబిఐ తెలిపింది. ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.29 కోట్ల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు సిబిఐ అధికార ప్రతినిధి ఆర్‌సి జోషి తెలిపారు.