దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మొదట సానుకూలంగా ప్రారంభమై ఆ తర్వాత కాసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 299 పాయింట్ల నష్టంతో 61,009 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 18,203 వద్ద ట్రేడవుతుంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.