భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగుళూరు లోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల ఎంపికకు ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా వేతనం రూ.20,000 నుంచి రూ.30,000 వరకు అందిస్తారు. నోటిఫికేషన్‌, అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://cpri.res.in/career ను సందర్శించి జనవరి 31, 2022 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం : ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వారి అకడామిక్‌, గేట్ స్కోర్‌, ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ : ముందుగా అధికారకి వెబ్‌సైట్ https://cpri.res.in/career ను సందర్శించాలి. Annexure – II లో దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి. వయస్సు, అర్హతలు, కులం, అనుభవం మొదలైన వాటికి సంబంధించిన సర్టిఫికెట్ల స్వీయధృవీకరించబడిన కాపీలు, దరఖాస్తు ఫారమ్‌తో పొందుపర్చాలి. చెల్లుబాటు అయ్యే గేట్/UGC NET స్కోర్ కార్డ్ యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీ దరఖాస్తు ఫారమ్‌తో పొందుపర్చాలి. కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఒకటి దరఖాస్తు ఫారమ్‌కి అతికించాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రొఫెసర్ సర్ సి.వి. రామన్ రోడ్, PB నెం.8066, సదాశివ నగర్ P.O. బెంగళూరు – 560 080 పంపాలి. దరఖాస్తులు పంపేందుకు జనవరి 31, 2022 వరకు అవకాశం ఉంది.