వార్తలు (News)

ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురి మృతి

పొదిలి మండలం తలమళ్ళ సమీపంలో జాతీయ రహదారిమీద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదం లో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.ఒంగోలు నుండి పొదిలి వస్తున్న బైక్ ను పొదిలి నుండి ఒంగోలు వెళ్తున్న కార్ వేగంగా ఢీ కొట్టింది.ఆ బైక్ మీద ఒక వ్యక్తి,ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు.మృతులు అందరు కూడా కనిగిరి మండలానికి చెందినవారు.ప్రమాదం జరిగిన చోట రహదారి మొత్తం గుంతలమయంగా ఉండడమే ఈ సంఘటనకు ప్రధాన కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.