నెనె డాన్యుడెచ్‌ అను వ్యక్తి థాయిలాండ్ లో నడుపుతున్న మోడలింగ్ ఏజెన్సీ లో కంప్యూటర్ నుండి 5 లక్షలకు పైగా చిన్నారుల అభ్యంతరకర ఫోటోలు స్వాధీనం చేసుకుని ఆయాయని అరెస్ట్ చేసారు.
ఆస్ట్రేలియా నిఘా అధికారుల నుండి వచ్చిన సమాచారం తో తాము ఈ ఏజెన్సీ మీద దడి చేసినట్టుగా థాయిలాండ్ పోలీస్లు వెల్లడించారు.ఈ ఆపరేషన్ లో ‘ఆపరేషన్‌ అండర్‌గ్రౌండ్‌ రైల్‌రోడ్‌’ అనే స్వచ్చంద సంస్థ సహకరించినట్టుగా తెలిపారు.
నిందితుడి కంప్యూటర్ లో వేలమంది థాయిలాండ్ చిన్నారులతో పటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు సంబందించిన బాలిక ఫోటోలు లభించాయని వాటిని వీరు దేశాలవారీగా వర్గీకరించి చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం వాడుతున్నట్టుగా తెలిసింది. పోలీస్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న ఖెమాచార్ట్‌ ప్రఖ్యోంగ్మనీ “ఈ స్కాం బైటపెట్టడం వల్ల మేము చాల గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పారు.2013 నుండి మొత్తం 8,400 మంది చిన్నారులు ఏజెన్సీ లో మోడలింగ్ కార్యక్రమాల్లో గుర్తించినట్టుగా కనుగొన్నారు.వీరికి ఈ విషయం ఏడాది క్రితమే తెలియగాఇప్పుడు ఈ ఆపరేషన్ ని నిర్వహించామని,ఒక్క ఫోటో మాత్రమే దొరికిందని,ఆ ఫోటో తీసిన వ్యక్తిని విచారించగా ఆ ఏజెన్సీ లో ఇలాంటి చిత్రాలు అనేకం ఉన్నాయని తెలిసిందని అనేక మంది చిన్నారుల మీద అఘాయిత్యాలకు కూడాపాల్పడి ఉంటుందని పోలీస్ లు అనుమానం వ్యక్తం చేసారు.