ఐ పి ఎల్ 2021 :
ఈసారి ఐ పి ఎల్ వేలం చాల ఉత్కంఠ గా కొనసాగుతుంది.అసలు గత ఏడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రాంచైజీస్ దృష్టి లో పెట్టుకోకుండా ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు.అందుకే గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది.వారిలో ముఖ్యంగా మోరిస్, మాక్స్ వెల్,మెయిన్ అలీ,శివమ్ దూబే,షకిబ్ముందు వరుసలోఉన్నారు.

మోరిస్:సౌత్ ఆఫ్రికన్ పేస్ గన్ క్రిస్ మోరిస్కు గత ఏడాది బెంగుళూరు తరపున కొన్ని మ్యాచులు మాత్రమే ఆడదానికి అవకాశం వచ్చింది.అయినా కూడా వాటిలో అద్భుతమైన ప్రదర్శన కనబరచి జట్టుకు విజయాలందించాడు.అత్యంత వేగంతో బంతులు వేసే మోరిస్ జట్టుకు అవసరమైన సమయం లో బాట్స్మన్గా మరి భారీ సిక్సర్ లు కూడా కొట్టగలడు.గత ఏడాది బెంగుళూరు మోరిస్ ను వదులుకోవడం వల్ల ఈసారి ఆయన వేలం లోకి వచ్చాడు.కాగా రూ .75 లక్షల ధరతో మొదలైన వేలం చివరికి రూ.16.25 కోట్లు ఇచ్చి రాజస్థాన్ జట్టు సొంతం చేసుకుంది.మోరిస్ కోసం ముంబై, పంజాబ్,రాజస్థాన్ లు తీవ్రం గా పోటీ పడ్డాయి.


మాక్స్ వెల్:గత సీజన్లో లో అసలు ఒక్క సిక్సర్ కొట్టకపోయిన కూడా మాక్స్ వెల్ కు ఈసారి భారీ మొత్తంలో 14 . 25 కోట్లు ఇచ్చి బెంగుళూరు సొంతం చేసుకుంది.గత ఏడాది పంజాబ్ తరపున ఆడిన మాక్స్ వెల్ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోవడం వల్ల పంజాబ్
యాజమాన్యం అతనిని వదులుకుంది.చివరికి భారీ మొత్తం ఇచ్చి బెంగుళూరు మాక్స్వెల్ ను సొంతం చేసుకుంది.


మెయిన్ :మెయిన్ అలీ కూడా గత ఏడాది పెద్దగా రాణించింది లేకపోయినా ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెన్నై ఆయనకు 7 కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంది.గత ఏడాది మెయిల్ బెంగుళూరు తరపున ఆడారు.


షకీబ్:నిషేధం కారణంగా గత సీజన్లో కు దూరమైన షకీబుల్ హస్సన్ కు ఈ సీజన్లో లో రూ.3.2 కోట్లు పెట్టి కొనుక్కుంది.ఈయన గత మ్యాచ్ లో కోల్ కత్తా జట్టుకి ప్రాతినిధ్యం వహించారు.

దూబే:శివమ్ దూబే గత ఏడాది కోహ్లీ సారథ్యం లో బెంగుళూరు జట్టుకు విజయాన్ని అందించడం లో ఆయన తనవంతు కృషిచేయడం తో అందరి దృష్టి ఆయన మీదకి మళ్లింది.శివమ్ ని రూ.4.4 కోట్లు పెట్టి కనుగోలు చేసింది.

డేవిడ్ మలన్:టీ 20 లో ప్రపంచ నం.1 బ్యాట్స్ మన్ గా ఉన్న డేవిడ్ మలన్ కు కేవలం రూ.1.5 కోట్లు దక్కించుకుని పంజాబ్ జట్టు ఆయనను కొనుగోలు చేసింది.