హైదరాబాద్: ప్రజల్లో మానవత్వం చనిపోయిందా..? సాటి మనిషి చనిపోతున్న పట్టించుకోవడం లేదా..? రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు..? బస్సుల్లో ఉన్న జనం చోద్యం చూశారు..? భయపడి కొందరూ దూరం జరిగితే.. మరికొందరూ అక్కడే ఉండి సినిమాల్లో సీన్‌ను చూసినట్టు చూసి ఉండిపోయారు. దుండగులను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు.. ఇదీ హైకోర్టు న్యాయవాది వామన్‌రావు హత్య కేసులో జరిగిన దారుణం. అసలు సాటి మనిషి చనిపోతుంటే ఎందుకు స్పందించలేక పోయారు.

హైటెక్ యుగంలో అందరూ బిజీనే క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. పక్కవాళ్లు ఎటు పోతే తమకేంటి అనే రీతిలో ఉన్నారు. అందుకే ఎదురుగా ఒక మనిషి చనిపోతుంటే చూస్తూనే ఉన్నారు కానీ, ఎవరూ అడ్డుకోలేదు. చుట్టూ జనం ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. కత్తులతో విచక్షన రహితంగా నరుకుతూ ఉంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రహదారి అది. వేలాది మంది ప్రయాణిస్తారు. సాటి మనిషి రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతుంటే మనిషి చనిపోతుంటే మనవత్వం లేకుండా ప్రవర్తించారు. పదుల సంఖ్యలో జనాలు చూస్తుండగానే దంపతులిద్దరూ చనిపోయారు