న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యోదంతం నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వామన్ రావు దంపతుల పార్థివదేహాలను సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ హత్యలు జరిగాయి. ఈ ఘటనపై సీఎం స్పందించాల్సిందే. దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు బాధిత కుటుంబం, న్యాయవాదుల పక్షాన పోరాడుతాం