శివ కందుకూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ‘మను చరిత్ర’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ చిత్రం లో కథానాయికలుగా మేఘ ఆకాష్,ప్రియా వడ్లమాని నటిస్తుండగా,భారత్ పేదగాని దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం నాడు ఈ చిత్ర బృందం శివ కందుకూరి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఇది ఒక లవ్ యాక్షన్ థ్రిల్లర్ గ రూపొందుతుందేమో అనే అభిప్రాయం కలుగుతుంది.
కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో యాపిల్ ట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌. శ్రీ‌నివాస‌రెడ్డి, రాన్‌స‌న్ జోసెఫ్ కలిసి ‘మ‌ను చ‌రిత్ర‌’ను నిర్మిస్తున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంద‌ని వారు తెలిపారు. గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్స‌వ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.