క్రైమ్ (Crime)

షబ్నమ్ కు రాష్ట్రపతి క్షమాబిక్ష నిరాకరణ

ఉత్తరప్రదేశ్ కు చెందిన షబ్నమ్ కు ఉరిశిక్ష అమలు చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం ఉరిశిక్షకు గురయ్యే మొదటి మహిళా షబ్నమ్ అయ్యే అవకాశం ఉంది.షబ్నమ్ యూ పి లోని అమ్రోహా అనే ప్రాంతానికి చెందిన వారు.2008 వ సంవత్సరం లో ప్రియుడు సలీం తో కలిసి తన కుటుంబానికే చెందిన ఏడుగురిని గొడ్డలితో నరికి హతమార్చారు.ఎం ఏ ఇంగ్లీష్ చదివిన షబ్నమ్, ఐదవ తరగతి ఫెయిల్ అయినా సలీం అనే వ్యక్తి ని ప్రేమించగా కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.దీనితో ఈ పెళ్లి జరగదనే భయంతో ఈ ఘాతుకానికి పాల్పడింది.ఈ కేసు లో సలీం,షబ్నమ్ లకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది.సుప్రీమ్ కోర్టు కింది కోర్టు తీర్పుని సమర్ధించగా,రాష్ట్రపతి క్షమాబిక్ష కు నిరాకరించడంతో మధురై జైలు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.నిర్భయ కేసు లు నిందితులని ఉరి తీసిన అదే కోర్టు లో షబ్నమ్ ను కూడా ఉరి తీయనున్నారు.తేదీ ఇంకా నిర్దారించవలసి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.