1977 లో కేంద్రంలో అధికారం లో ఉన్న జనతా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి రూ.1000 కోట్లు మంజూరు చేయడంతో ప్లాంట్ పనులు మొదలు అయ్యాయి.రష్యా సహకారంతో స్టీల్ ప్లాంట్ నిర్మించారు.అంతకు ముందు వరకు సెయిల్ లో భాగంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ 1982 ఫిబ్రవరి 18 న రాష్ట్రీయ ఇస్ఫాత్ నిగమ్ లిమిటెడ్ (రిల్)గ ఆవిర్భవించింది.అందుకే ఫిబ్రవరి 18 వ తేదీనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన 1971 జనవరి 20 న వైజాగ్ లో జరిగింది.కానీ నిధుల కొరత వల్ల మెల్లగా పనులు పూర్తి చేసుకుని దాదాపు 20 ఏళ్లకు 1990 లో ఉత్పత్తి ప్రారంభించింది.ఆ తరువాత రెండు ఏళ్లకు గాని పూర్తి స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేయడం జరగలేదు.ఆలా అన్ని బాలారిష్టాలు దాటుకుని ప్రస్తుతం 7 . ౩ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి చేరింది.

ఈ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణ త్యాగాల ఫలితం.అసలు విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ నే ముఖ్య కారణం. 17 వేలమంది శాశ్వత ఉద్యోగులు ఉండగా,లక్ష కు పైగా పరోక్షంగా ఆధారపడిన వారితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందరికో జీవనాధారం ఇస్తుంది.ఎన్నో ఏళ్లుగా లాభాలు సంపాదించి పెట్టిన స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడు నష్టాలు వస్తున్నాయనే నెపం తో ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలకు నష్టం వాటిల్లుతుంది అనేది స్థానికుల వాదన!
ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మా తరువాతి తరాల వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతాయని ఆశ తో మేము వేలాది ఎకరాలు ఇచ్చి నేడు ఎంతో మంది రైతులు నిర్వాసితులు అయ్యారు.వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేవారు ఎవరు అని ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇక మరో ముఖ్యమైన విషయం స్టీల్ ప్లాంట్ అనగానే ఎక్కువ మంది మాట్లాడేది ఆర్ కార్డుల కోసమే! ఆర్ కార్డు అంటే రీహాబిలిటేషన్ కార్డు. ప్లాంట్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు స్టీల్ ప్లాంట్ వీటిని ఇచ్చింది.ఆ రోజుల్లో 16,500 మందికి ఈ కార్డు లు ఇచ్చారు.వారిలో దశల వారీగా 8,500 మందికి ప్లాంట్ లో ఉద్యోగావకాశాలను కూడా కల్పించారు.ఇంకా వారిలో 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వవలసి ఉంది.ఇప్పడు వారు అంతా కనీసం భూమి ఉంటె అయినా దర్జాగా బ్రతికేవాళ్ళం అని వాపోతున్నారు.మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము ఇప్పటికి మాది 3 వ తరం అని ఇంకా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము అని స్థానిక నివాసి ఒకరు ఆవేదన వ్యక్తం చేసారు.

స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం కోసం స్థానిక యువత అంతా కూడా టెక్నికల్ కోర్సులు ఎక్కువగా చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివేవాళ్లే నిర్వాసిత గ్రామాల్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ యువత పీజీలు, పీహెచ్డీలు చేసినా కూడా …స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాలు కోసం ఐటీఐ, డిప్లామో వంటి టెక్నికల్ కోర్సులు తప్పనిసరిగా చేస్తారు.మొదట ఆర్ కార్డు ఉంది పడవ తరగతి పాస్ అయితే చాలు ఎదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందని భ్రమలో ఉండేవాళ్ళం కానీ తరువాత ఐ టి ఐ వంటి కోర్స్లు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని అవి కూడా చేయడం మొదలు పెట్టాము.దానిలో కూడా ఫిట్టర్, మెకానిక్,ఎలక్ట్రికల్ లాంటి రెండు మూడు విభాగాలలో కోర్స్ లు చేసేవాళ్ళం.ప్లాంట్ లో అప్పుడప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన కూడా అందులో ఆర్ కార్డు ఉన్నవారికి ప్రత్యేక కోటా అంటూ ఏమి లేదు.దీనిమీద యూనియన్స్ కూడా పోరాటం చేయలేదు.దానితో భూములు ఇచ్చిన వారికీ మొదటి నుండి అన్యాయమే జరిగింది అని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ రాగానే విశాఖపట్నం రూపు రేఖలే మారిపోయాయి.ఆ చుట్టుపక్కల భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.అపాపిట్లో ఒక ఎకరం 1,100 రూపాయలకు ఇచ్చారు కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చుట్టూ పక్కల ప్రాంతాలలో ఎకరం 8 కోట్లకు తక్కువ లేదు, అప్పట్లో మా చేతిలో ఆర్ కార్డు పెట్టిన ప్రభుత్వం వాటిని ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయడం తప్ప ఉద్యోగాలు మాత్రం అందరికి ఇవ్వలేదు.గత 50 ఏళ్లుగా నేడో రేపో ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నా మాకు నేడు ఆ సంస్థ ప్రైవేటీకరణ అన్నది ఆశానిపాతం గ తగిలింది, దీనికి మేము అంగీకరించాము అని,ఒకవేళ ఆ నిర్ణయం మార్చని పక్షం లో మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలని అక్కడి నిర్వాసితురాలు ఒకరు అన్నారు.