ఎన్నికలు (Elections)

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్

అమరావతి

★ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

★ ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించింది.

★ అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

★ ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు.

★ కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది.

★ గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది.

★ ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో తెలిపింది.

★ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.