వార్తలు (News)

తెలంగాణలో పాఠశాలల్లో 26 మంది విద్యార్థులకు కరోనా

తెలంగాణలో విద్యార్థులపై కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో మొత్తం 105 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అందులో 22 మంది విద్యార్థులతో పాటు వార్డెన్‌తో పాటు వసతిగృహ కాపలాదారుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ నిర్ధారణ అయిన విద్యార్థులను పాఠశాలలోని రెండో అంతస్తులో ఐసోలేషన్‌లో ఉంచారు. మిగిలిన విద్యార్థులను ఇంటికి పంపించారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించారు.

శంషాబాద్‌ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. వీరు చిన్న గోల్కొండ, పెద్ద గొల్కొండ గ్రామాలకు చెందినవారు. వీరు 8వ తరగతి విద్యార్థులు. 48 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరోనా పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో ఇద్దరు వైరస్‌ బారిన పడినట్లు గుర్తించారు. కరోనా సోకిన విద్యార్థులను హోం ఐసోలేషన్‌కుతరలించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.