నిర్మల్‌ జిల్లా భైంసాలో పాఠశాలలో కరోనా సృష్టించిన కలకాలంగురించి మీకు తెలిసిందే!
కొవిడ్‌ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. భైంసాలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో గురువారం 176 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మరో 25 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వైరస్‌ సోకిన విద్యార్థుల సంఖ్య 34కి చేరింది

ఒకే పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడటంతో అధికారులు పాఠశాలలోని మిగతా 140 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మండలంలో విధి నిర్వహణలో ఉన్న 29 మంది పోలీసులకు కొవిడ్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.