సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కొత్త భవనం నిర్మించేందుకు సెల్లార్ తీస్తుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందే మూడు ఆ భవనంలో ఉండే వారు అంటే బయటకు వెళ్లిపోయారు. వారు భవనంలో ఉన్నట్లయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.