వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

సందిగ్ధంలో కోహ్లీ….

ఫామ్‌లో లేని రాహుల్ కోసం ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు ఫామ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తలనొప్పిగా మారాయి. ఈ విమర్శలు అన్ని టీమిండియా కీలక అటగాడు కేఎల్ రాహుల్ గురించి వస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరచడంతో రాహుల్‌ను పక్కన పెట్టాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. కానీ మేనేజ్‌మెంట్, కోహ్లీ మాత్రం రాహుల్ వైపే మొగ్గుచూపుతున్నారు.

టీమిండియాలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ఒకడని, ఒక మంచి ఇన్నింగ్స్‌తో అతను కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్‌కు తుది జట్టులో చోటు కల్పించినా ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దించాలనే విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. రోహిత్‌తో పాటు రాహుల్‌ను ఓపెనింగ్‌కు దించకూడదని విశ్లేషకులు సూచనలిస్తూ ఫామ్‌లో ఉన్న ధవన్ అయితేనే జట్టుకు శుభారంభాన్ని ఇస్తాడని చెబుతున్నారు. మూడో స్థానంలో కోహ్లీ, ఐదు, ఆరు స్థానాల్లో పంత్, హార్దిక్ బ్యాటింగ్‌కు వస్తారు. ఇక, మిగిలింది నాలుగో స్థానం. ఆ స్థానం కోసం ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ పోటీ పడుతున్నా నేపథ్యంలో రాహుల్ విషయంలో కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.