భారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ20 మ్యాచ్‌ టాస్‌ వేయగా మోర్గానే మళ్లీ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకుని ఈ పోరు‌ కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు. అప్పటితో పోలిస్తే పచ్చికను పూర్తిగా తొలగించారు. వికెట్‌ చాలా గట్టిగా ఉండడంతో ఆంగ్లేయులు మళ్లీ అదనపు పేస్‌, బౌన్స్‌తో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలిస్తుందని ఈ పోరులో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్‌ చేజార్చుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌ చాహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.