జాతీయం (National) వార్తలు (News)

ఇకపై జీపీఎస్‌ ఆధారంగా టోల్ – నితిన్‌ గడ్కరీ

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ టోల్ ప్లాజాల గురించి చర్చించారు.దేశవ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారని మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్‌ కడుతున్నా ఫాస్టాగ్‌ ఉపయోగించడం లేదని చెప్పారు. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు 2016లో ఫాస్టాగ్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టోల్‌ ప్లాజాల వద్ద ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్‌ లేని వారి నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు.

ఇప్పుడు అన్ని వాహనాల్లో వెహికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ వస్తుంది కనుక టోల్‌ వసూలుకు కూడా జీపీఎస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీపీఎస్‌ ఆధారంగా వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలో వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీలు పడతాయి. టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.