జాతీయం (National) వార్తలు (News)

నష్టాల నెపంతో 13 విమానాశ్రయాల విక్రయం

రూ.20000 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతోనే విమానయాన శాఖ ఆస్తులను విక్రయిస్తుందని సమాచారం. కేవలం నష్టాల్లో నడుస్తున్న విమానాశ్రయాలను విక్రయానికి పెడితే, కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరేమో అనే ఉద్దేశ్యంతో లాభాల్లో ఉన్న వాటితో కలిపి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడైతే సామర్థ్యం ఉన్న బిడ్డర్లు ముందుకు వస్తారనే భావనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఒక అధికారి వెల్లడించారు.

అందుకే నష్టాలు-లాభాల్లో ఉన్న 13 విమానాశ్రయాలను కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విక్రయించనుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటికి బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉంద’ని, నష్టాల్లో-లాభాల్లో ఉన్న విమానాశ్రయాలకు కలిపి బిడ్‌ వేయాల్సి ఉంటుందాని ఒక అధికారి పేర్కొన్నారు. 2019లో ఆరు విమానాశ్రయాలకు నిర్వహించిన వేలంలో అదానీ పోర్ట్స్‌ అన్నింటినీ దక్కించుకుంది. ఈ 6 విమానాశ్రయాల విక్రయ సమయంలో అమలు చేసిన షరతులనే ప్రతిపాదిత 13 విమానాశ్రయాల విక్రయానికీ ప్రభుత్వం వర్తింపచేసే అవకాశం ఉంది అని ఆ అధికారి వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.