వార్తలు (News)

నేడు నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్

గురువారం దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ముగిసే సమయానికి నష్టపోక తప్పలేదు. సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర నష్టపోయి, నిఫ్టీ 14,600 మార్కు దిగువన ముగిసింది. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో ఆరంభ లాభాలు నష్టపోయాయి. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం (బాండ్‌ ఈల్డ్స్‌) మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సూచీలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలు చవి చూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.53గా ఉంది.

ఉదయం 50,232 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం వరకు అదే ఊపులో ఉండి మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో కొంచం కొంచంగా కిందకు దిగి చివరికి 585.10 పాయింట్ల నష్టంతో 49,216 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠాల నుంచి వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ కూడా 163.45 పాయింట్ల కోల్పోయి 14,557.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, దివీస్‌ ల్యాబ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐటీసీ లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.