పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో రూ.8 లక్షలకు పైగా నగదు చోరీకి గురి కావడం కల్లోలం సృష్టిస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించ వలసిన పోలీసులు ఉండే చోట డబ్బు చోరీ కావడం అనేది మాములు విషయం కాదు! వివరాల్లోకి వెళ్తే… పోలీస్‌స్టేషన్‌లో రూ.8 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 15 నుంచి బ్యాంకులకు సెలవు కావడంతో మండలంలోని వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడే భద్రపరిచారు. బుధవారం ఉదయం ఆ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన దుకాణ సిబ్బందికి డబ్బు కనిపించకపోవడంతో రూ,8,04,330 నగదూ చోరీకి గురైనట్లు గ్రహించి వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా అపహరణ విషయమై పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది విచారణ చేపట్టారు.