వార్తలు (News)

హైద్రాబాద్లో కనుగొన్న కొత్త బ్యాక్టీరియాతో అంటువ్యాధుల ముప్పు

కరోనా విజృభిస్తున్న ఈ సమయంలో ప్రజలు అందరు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయంలో హైదరాబాద్ వాసులకు మరొక కొత్త సమస్య వచ్చిపడింది. అదేంటంటే…. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల సరస్సులు, చెరువులు, రిజర్వాయర్లలో ఓ ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఒకటి పెరుగుతుందని ఐఐటీ హైదరాబాద్‌‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే హైదరాబాద్ రస్సులలో భారీ లోహాలు, మురికి నీరు, ఇతర కాలుష్య కారకాలు ఉంటాయన్న విషయం తెలుసు. ఇప్పుడు వీటితోపాటు కార్డపెనెంస్ అని పిలిచే ఎన్‌డీఎం-1 (న్యూ ఢిల్లీ మెటల్లో-బీటా-లాక్టమాస్-1) జన్యువును కలిగి ఉన్న ఘోరమైన బ్యాక్టీరియా పెరుగుతోందని పరిశోధకులు గుర్తించారు.

ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియాలో కార్డపెనెంస్ అని పిలిచే ఎన్‌డీఎం-1 (న్యూ ఢిల్లీ మెటల్లో-బీటా-లాక్టమాస్-1) జన్యువును కలిగి ఉందని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తాతికొండ శశిధర్, పరిశోధనా నిపుణుడు రాజీవ్ రంజన్‌తో కలిసి హైదరాబాద్ పరిసరాల్లోని నీటి వనరుల నుంచి నీటి నమూనాలను సేకరించారు. దీన్ని పరీక్షించగా ఎన్‌డీఎం-1 జన్యువు కలిగిన బ్యాక్టీరియా ఉనికిని కనుగొన్నట్లు వారు తెలిపారు. ఎన్‌డీఎం-1 జన్యువుతో ఉన్న బ్యాక్టీరియా మానవులలో అంటువ్యాధులకు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ ఆనవాళ్లు గుర్తించిన ప్రదేశాలు మంజీరా ఆనకట్ట, సింగూర్ ఆనకట్ట, మంజీరా నీటి శుద్ధి కర్మాగారం, అంబర్‌పేట్ మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్‌టీపీ) ఇంకా 13 సరస్సులు, దుర్గం చెరువు, అమీన్‌పూర్, ఉస్మాన్ సాగర్, అల్వాల్, హుస్సేన్‌సాగర్, మోమీన్‌పేట్, సరూర్‌నగర్, ఫాక్స్ సాగర్, హిమాయత్ సాగర్, కంది, మీర్ ఆలం, నాగోల్, సఫిల్‌గూడ గా తెలుస్తున్నాయి. వీటిని హైదరాబాద్‌లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తాతికొండ శశిధర్, పరిశోధనా నిపుణుడు రాజీవ్ రంజన్‌తో కలిసి కనుగొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.