గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో ఈ తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న మినీ లారీని మరోలారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారుజామున ఓ మినీ లారీ టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు పక్కన ఆపి ఆ లారీకి పంక్చర్‌ వేస్తుండగా అటునుంచి వస్తున్న 12టైర్ల లారీ మినీ లారీని వీరిని ఢీకొట్టింది. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.