వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య

భారత ప్రముఖ మహిళా రెజ్లర్లు‌ బబితా ఫోగాట్, గీతా ఫోగాట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. అలాగే వారి కజిన్‌ సిస్టర్‌ రితికా ఫోగాట్‌ కూడా రెజ్లింగ్ లో రాణించాలనుకున్నారు. దానికి తగ్గ శిక్షణ కూడా గత ఐదేళ్లుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫోగాట్ దగ్గర తీసుకుంటున్నారు. తాజాగా భరత్‌పూర్‌లోని లోహ్‌ఘర్‌ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఉమెన్‌, సబ్‌ జూనియర్‌ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచిన రితికా ఫైనల్‌కు చేరుకున్నారు.మార్చి 14న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రితికా ఫోగట్ ఓటమిపాలయ్యారు. కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో ఓటమిని చవిచూడడంతో తీవ్ర నిరాశకు గురైన రితికా.. తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన యావత్‌ క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రితికా మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చి 16న రితికా అంత్యక్రియలు జరిగాయి. ఒక్క చిన్న ఓటమికే తనువు చాలించడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.