వార్తలు (News)

భాగ్యనగర్ ఫేస్‌-2 కాలనీ.. జేసీబీతో నిత్యావసర వస్తువుల రవాణా??

లింగోజిగూడ డివిజన్‌ భాగ్యనగర్ ఫేస్‌-2 కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో 14నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసినా సమస్య పరిష్కరించడం లేదని, లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలం వచ్చిందటే చాలు.. డ్రైనేజీలు పొంగిపొర్లి మోకాళ్ల లోతు వరకు రోడ్లపైకి నీరు చేరుతుందని, ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. రోడ్లపై డ్రైనేజీ నీరు చేరడంతో దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు.

ట్రంక్‌లైన్‌ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరైనా పక్క కాలనీవాసులు అంగీకరించకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు పనులు నిలిపివేశారన్నారు. ఇంటి ముందు వరద నీరు ఉండడంతో కాలనీ వాసులు అందరూ కలిసి ఒక జేసీబీని అద్దెకు తీసుకొని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడటం బాధాకరమని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇకనైనా నేతలు, అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •