క్రైమ్ (Crime) వార్తలు (News)

33 కేసుల్లో నిందితుడి హత్య!!

వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న టౌలీచౌకి హుమాయున్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ముస్తాక్‌ ఉద్దీన్‌(33) ఒక రౌడీషీటర్‌. అతడికి ఓల్డ్‌మలక్‌పేటలో సొంత ఇల్లు ఉండడంతో తరచూ వస్తుండే నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఓల్డ్‌మలక్‌పేటలోని అబూబాకర్‌ మసీదు వద్దకు వచ్చి సోదరులైన అయూబిన్‌ అలీ, మహమూద్‌ మరో నలుగురు యువకులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అది కాస్త ముదరడంతో ఆగ్రహానికి గురైన వారంతా సయ్యద్‌ ముస్తాక్‌ ఉద్దీన్‌ను కత్తులతో పొడిచారు. రాళ్లతోనూ దాడికి పాల్పడడంతో ముస్తాక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అతనిపై మొత్తం 33 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •