వార్తలు (News)

ముంబయిలో భారీ వర్షాలతో ఇళ్లు కూలి 20 మంది మృతి!!

ముంబయిలోని చెంబూరు భారత్‌ నగర్ ప్రాంతంలో చెట్టు విరిగిపడి గోడ కూలిన ప్రమాదంలో 17 మంది చనిపోగా గాయపడిన వారిని రాజవాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విఖ్రోలీలో ఒక ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు చనిపోగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పంచశీల్ చాల్ ప్రాంతంలోని సూర్యనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు మూడు మృత దేహాలను శిథిలాల నుంచి బయటకు తెచ్చామని, మరో అయిదారుగురు అందులో చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నామని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) డిప్యూటీ కమాండెంట్ ఆశిష్ కుమార్ తెలిపారు.

శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరంలో చాలా చోట్ల వరదలు ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. హనుమాన్ నగర్ ప్రాంతంలోని ఖండీవాలీలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలైన కింగ్స్ సర్కిల్, లాల్ బాగ్‌లలో నీళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. కుంభవృష్ఠి కారణంగా సియాన్ రైల్వే లైన్ కూడా నీట మునిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •