క్రైమ్ (Crime) వార్తలు (News)

విధుల్లో మద్యం సేవించి మత్తులో మునిగిన స్టేషన్ మాస్టర్..??

ఢిల్లీకి చెందిన అనిరుద్‌ కుమార్‌ ఉత్తర్ ప్రదేశ్ లోని కాంచౌసి రైల్వేస్ లో అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో గురువారం విధులకు హాజరై పూర్తిగా మందు సేవించి కాసేపటికి మత్తులోకి జారుకున్నాడు.

ఆ దెబ్బకి గురువారం అర్ధరాత్రి 12.10నిllలకు సిగ్నల్స్ నిలిచిపోగా అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో వాటి వెనకాల గూడ్స్ రైళ్లు క్యూ కట్టాయి. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య ప్రయాణించాల్సిన రైళ్లు సిగ్నల్స్ లేక నిలిచిపోవడంతో ఎంతకీ రైళ్లు కదలకపోవడంతో సెంట్రల్‌ రైల్వే అధికారులు అనిరుద్‌ కుమార్‌కు ఫోన్‌ చేస్తే ఎంతకీ ఫోన్ తీయలేదు.

అర్ధరాత్రి 1 గంట సమయంలో అధికారులు పరుగున స్టేషన్ కి వెళ్లి చూడగా అనిరుద్ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పరిశీలించిన అధికారులు మద్యం సేవించినట్లు గుర్తించి వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి, పరీక్షల నిమిత్తం తుండ్లాలోని మెడికల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •