టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇకపై పుస్తకాలు చూసి పరీక్షలు రాయొచ్చు!!

ఇప్పటివరకు చర్చలకే పరిమితమైన ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానాన్ని రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచే అమలు చేసేలా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానంలో సబ్జెక్టుపై పట్టు ఉంటేనే పరీక్షలు బాగా రాయగలుగుతారు. ప్రయోగ (ప్రాక్టికల్‌) పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి దీంతో భావనల (కాన్సెప్ట్‌)పై అవగాహన తప్పనిసరి.

కొత్త విధానాన్ని అమలు చేయాలంటే ప్రశ్నపత్రాలు, బోధన తీరు కూడా మారాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఎలా వచ్చినా జవాబులు రాసేలా విద్యార్థులను సంసిద్ధులను చేయాలనే విధానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఏఐసీటీఈ, యూజీసీ సైతం పరీక్షలను ఓపెన్‌ బుక్‌ విధానంలో పెట్టుకోవచ్చని, అది ఆయా వర్సిటీల ఇష్టమని స్పష్టంచేశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •