అంతర్జాతీయం (International) వార్తలు (News)

న్యూజిలాండ్ లో ఒక కరోనా కేసు.. 3 రోజుల లాక్‌డౌన్!!

న్యూజిలాండ్ లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా కేసు నమోదవడంతో ఆ దేశ ప్రభుత్వం మూడు రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ విషయమై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ తాజాగా నమోదైన కేసు డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్టు, గడిచిన ఆరు నెలలుగా ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ డెల్టా వేరియంట్ నేపథ్యంలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని జెసిండా అన్నారు. తక్షణమే స్పందించని పక్షంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇతర దేశాలను చూసి తెలుసుకోవచ్చని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •