రాజకీయం (Politics) వార్తలు (News)

శ్రీకాళహస్తిలో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నవరత్న నిలయం నిర్మాణం !!

శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించారు. ‘జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నిర్మించారు. నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిలయం మధ్యలో జగన్‌ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు. మధ్యలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాగి ఆకుల్లో సీఎం జగన్‌ బొమ్మను చిత్రీకరించగా అద్దాల గోపురంలోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోలు కనిపిస్తాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •