టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మీ వాట్సాప్ ప్రొఫైల్ ఎవరు ఎవరు చూశారో మీకు తెలుసా??

వాట్సాప్ లో మెసేజ్ లు పెట్టడం, వీడియో కాల్స్ మాట్లాడడంతో పాటు ఎక్కువ మంది ఉపయోగించుకునే సౌలభ్యం స్టేటస్ ద్వారా మన గురించి అవతలివారికి చెప్పడం! అలాగే మన స్టేటస్ లేదా DP ఎవరెవరు చూశారో కూడా తెలుసుకుంటాం. దీనిలో వాట్సాప్ స్టేటస్ గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవాలని కూడా మీకు కుతూహలంగా ఉండవచ్చు.

మీ Whatsapp ప్రొఫైల్ లేదు DP (డిస్ప్లే పిక్చర్) ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి? అని తెలుసుకుందాం. మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకొండి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా లభ్యమవుతుంది.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ DP ఎవరెవరు చూసారో మీరు తెలుసుకోండి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •