అంతర్జాతీయం (International) వార్తలు (News)

తాలిబన్లకు జర్మనీ సాయం నిలిపివేత??

అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకుని సంతోషపడుతున్న తాలిబన్ల కు జర్మనీ షాకిచ్చింది. అఫ్గన్‌కు డెవలప్‌మెంట్‌ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని జర్మన్‌ డెవలప్‌మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ వివరించారు. దేశానికి అభివృద్ధి సహకారాన్ని ప్రస్తుతానికి నిలిపివేశామని, అలాగే అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్‌జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే పని కొనసాగుతుందని రినిష్ అన్నారు.

అంతకుముందు అఫ్గన్‌ సంక్షోభంపై స్పందించిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ కాబూల్ విమానాశ్రయంలో వేలాదిమంది ప్రజలు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిగ్గుచేటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానవ విషాదానికి అందరమూ బాధ్యులమని వ్యాఖ్యానించారు. ఇంకా తమ పౌరులతోపాటు, వారికి అండగా నిలిచిన అఫ్గాన్‌ ప్రజల క్షేమం కోసం తాము చేయ గలిగిందంతా చేస్తామని హామీ ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •