జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐడీబీఐ బ్యాంకులో 920 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!!

ఐడీబీఐ బ్యాంక్ కాంట్రాక్ట్ పద్ధతిలో మొత్తం 920 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశంలోని వేర్వేరు బ్రాంచ్‌లు, ఆఫీసుల్లో ఉన్న ఈ పోస్ట్ ల దరఖాస్తుల స్వీకరణ కు ఆఖరి తేదీ 2021 ఆగస్ట్ 18 గా నిర్ణయించారు. మరియు దరఖాస్తుల్ని ఎడిట్ చేయడానికి, ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ చేయడానికి 2021 ఆగస్ట్ 18 లాస్ట్ డేట్ గా నిర్ణయించారు.

2021 సెప్టెంబర్ 5న ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ లో దరఖాస్తు చేయాలి. మొత్తం పోస్టులు 920 ఉంటే అన్‌రిజర్వ్‌డ్-373, ఎస్‌సీ-138, ఎస్‌టీ-69, ఓబీసీ-248, ఈడబ్ల్యూఎస్-92 చొప్పున ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులు 50 శాతం మార్కులతో పాస్ అయితే చాలు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1,000. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.200.

వేతనాల వివరాలు చూస్తే ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.29,000, రెండో ఏడాది నెలకు రూ.31,000, మూడో ఏడాది నెలకు రూ.34,000 చొప్పున వేతనం లభిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్ ఉండదు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి https://www.idbibank.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. CAREERS/CURRENT OPENINGS పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Recruitment of Executives on Contract-2021 క్లిక్ చేయాలి. ఆ తర్వాత APPLY ONLINE క్లిక్ చేయాలి. ఆ తర్వాత Click here for New Registration పైన క్లిక్ చేయాలి. పేరు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థులు ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. COMPLETE REGISTRATION పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •