వార్తలు (News)

ఏపీ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు??

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో మంగళవారం మరలా కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్ఫ్యూపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపులను మరో గంటపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సడలింపులుంటాయి. ఇక పెళ్లిళ్ల విషయంలో కూడా నిబంధనలు విధిస్తూ పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు 150 మందిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ఒకవేళ అర్ధరాత్రిగానీ, తెల్లవారుజామునగానీ ముహూర్తాలు ఉంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని, ఫంక్షన్ల సమయంలో ఖచ్చితంగా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •