అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఘోర ప్రమాదానికి గురైన రష్యా సైనిక రవాణా విమానం!!

మంగళవారం ముగ్గురు వ్యక్తులతో ఉన్న రష్యా సైనిక రవాణా విమానం కూలిపోయింది. Ilyushin Il-112V పరీక్షా విమానంలో మంటలు చెలరేగి కూలిపోయింది. ఈ విమానం తక్కువ ఎత్తులో ఎగురుతూ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఒక రెక్కకు మంటలు అంటుకోవడంతో విమానం చుట్టూ తిరగడానికి ప్రయత్నిస్తూ.. అకస్మాత్తుగా పదునైన మలుపు తీసుకుని నేలపైకి దూసుకెళ్లింది. ఫలితంగా భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఆచూకీ దొరకలేదని తెలుస్తుంది.

Ilyushin Il-112V యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయబడగా.. క్రాష్ నివేదికల ప్రామాణికతను తాము పరిశీలిస్తున్నామని, ప్రయాణీకుల ఆచూకీపై ఎలాంటి నిర్ధారణ లేదని రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •