అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆఫ్ఘన్ లో తాలిబన్ల అరాచక పాలన మొదలు!!

అఫ్గాన్‌లో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడడంతో ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా! దేశ రాజధాని కాబుల్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు దేశ పార్లమెంట్‌ భవనంలోకి వెళ్లి జాతీయ పతాకాన్ని కిందకు దింపి, తమ జెండాను ఎగురవేయడంతో స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనగా జలాలాబాద్‌లో అనేక మంది స్థానికులు జాతీయ జెండాలను చేతబూని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌పై మళ్లీ జాతీయ జెండానే ఎగురవేయాలని నినదించారు.

దీంతో ఈ ర్యాలీపై తాలిబన్లు తూటాలు కురిపించిన దాడిలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి నిరసన ఇదే కావడం గమనార్హం! అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రజలందరూ పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు. అయితే గతంలో తాలిబన్ల అరాచక పాలన చూసిన ప్రజలు మాత్రం వారి ప్రకటనను విశ్వసించలేదు. ప్రజలు అనుకున్నట్లుగానే తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపుతూ ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •